ఓటిటి బాటలో రంగీల ఊర్మిళ

ఊర్మిళ…. ఒకప్పుడు గ్లామర్ క్వీన్. సరిగ్గా పాతికేళ్ల క్రితం ఆమె టాప్ హీరోయిన్లలో ఒకరు. రంగీళ, భారతీయుడు, సత్య వంటి చిత్రాలతో దేశాన్ని ఊపేసిన బ్యూటీ ఊర్మిళ. దాదాపు 15 ఏళ్ల పాటు వెండితెరకు దూరమయ్యారు. ఆమె మళ్ళీ ఇప్పుడు కొత్త ఇన్నింగ్స్ మొదలుపెట్టారు.

ఇప్పుడు ఊర్మిళ వయస్సు 48. ఇప్పుడు హీరోయిన్ పాత్రలు పోషించలేదు కదా. అందుకే, సుష్మిత సేన్ లా ఆమె కూడా ఓటిటి బాట పట్టారు. హీరోలకు అమ్మ పాత్రలు పోషించే బదులు ఓటిటిలో మంచి రోల్స్ చేసుకోవడం బెటర్. అందుకే, ఆమె తన రీఎంట్రీకి ఓటిటి మాధ్యమాన్ని ఎంచుకున్నారు.

“తివారి” అనే వెబ్ సిరీస్ లో ఆమె నటించారు. ఆమెదే టైటిల్ రోల్. యాక్షన్ పాత్ర. “కొత్త ప్రయాణం స్టార్ట్ చేస్తున్నందుకు ఆనందంగా ఉంది. ఇది నా కొత్త ఇన్నింగ్స్. మంచి పాత్ర, మంచి ప్రాజెక్ట్ తోనే మళ్ళీ మీ ముందుకు వస్తున్నాను,” అని ఆమె తన ఇన్ స్టాగ్రామ్ ద్వారా ప్రకటించారు.

మధ్యలో కొన్నాళ్ళూ రాజకీయాల్లో అదృష్టం పరీక్షించుకున్నారు. కానీ అది వర్కవుట్ కాలేదు. ఆ మధ్యలో పెళ్లి కూడా చేసుకున్నారు. కానీ, ఇప్పుడు భర్తతో కలిసి ఉండడం లేదట. సో, మళ్ళీ యాక్టింగ్ లో యాక్టివ్ అయ్యే పనిలో ఉన్నారు.

 

More

Related Stories