
ఊర్వశి రౌటేలా గురించి పరిచయం అక్కర్లేదు. ఇప్పటికే తెలుగులో నాలుగు ఐటెం సాంగుల్లో డ్యాన్స్ చేసింది. ఈ భామ ఇప్పుడు తన ఫోన్ పోయింది అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టుకొంది. అది ఆషామాషి మొబైల్ ఫోన్ కాదు మరి.
24 కేరట్ల బంగారంతో చేసిన ఐఫోన్. డిజైనర్ ఐఫోన్ ని ఈ భామ ఆ మధ్య కొనుక్కుందట. అది ఇప్పుడు పోయింది. నిన్న (అక్టోబర్ 14) అహ్మదాబాద్ స్టేడియంలో ఫోన్ పోగొట్టుకొంది ఈ భామ. ఇండియా – పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ చూసేందుకు స్టేడియంకి వెళ్లిన ఈ భామ అక్కడే ఫోన్ మిస్ చేసుకొంది.
“ఎవరికైనా దొరికితే వెంటనే నాకు తెలపండి. నన్ను వెంటనే కాంటాక్ట్ చెయ్యండి ప్లీజ్,” అంటూ ఊర్వశి సోషల్ మీడియా ద్వారా వేడుకొంది.
ఊర్వశి ఫోన్ లక్షల ఖరీదు చేస్తుంది. 24 క్యారట్ల బంగారంతో చేసిన ఫోన్ పోవడంతో పాటు ఎవరైనా ఆ ఫోన్ ని అన్ లాక్ చెయ్యగలిగితే ఆమె డేటా అంతా దొరికిపోతుంది. ఆమె పర్సనల్ ఫోటోలు, సమాచారం కూడా పోతుంది. అందుకే ఆమె భయపడుతోంది. ఐతే, అన్ లాక్ చెయ్యడం అంతా ఈజీ కాదు అనుకోండి.
తెలుగులో ఈ భామ “వాల్తేర్ వీరయ్య”, “ఏజెంట్”, “బ్రో”, “స్కంద” వంటి సినిమాల్లో ఐటెం సాంగ్స్ చేసింది.