
ఊర్వశి అందాలు దేశవ్యాప్తంగా పాపులర్. ఆమె హాట్ పోజులకు టాలీవుడ్ జనాల్లో కూడా ఫ్యాన్స్ ఉన్నారు. అలా తన గ్లామర్ తో తెలుగులో కూడా పాపులర్ అయిన ఊర్వశి రుథేలా ఎట్టకేలకు ఇక్కడ ఎంట్రీ ఇస్తోంది. సంపత్ నంది ఆమెను టాలీవుడ్ కు తీసుకొచ్చాడు. గోపీచంద్ హీరోగా సంపత్ నంది డైరెక్షన్ లో రూపొందుతోన్న “సీటీమార్” అనే సినిమాలో ఊర్వశి ఒక ఐటెం సాంగ్ చేస్తోంది. ఇప్పుడు తాను రాసిన web movie స్క్రిప్ట్ కి ఆమెని హీరోయిన్ గా చేశాడు.
శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై “బ్లాక్ రోజ్” అనే సినిమా లాంఛ్ అయింది. ఈ సినిమాకు సంపత్ నంది కాన్సెప్ట్ అందించాడు. దర్శకత్వ బాధ్యతల్ని మోహన్ భరద్వాజ్ కు అప్పగించాడు. ఇప్పుడీ ప్రాజెక్టుతో ఊర్వశి టాలీవుడ్ లో అడుగుపెట్టబోతోంది.
Also Check: Urvashi Rautela Photo Gallery
షేక్స్ పియర్ రాసిన “ది మర్చంట్ ఆఫ్ వెనిస్” లోని షైలాక్ పాత్రను బేస్ చేసుకొని ఫిమేల్ ఓరియంటెడ్ సబ్జెక్ట్ గా రాబోతోంది “బ్లాక్ రోజ్”. అందుకే ఈ సినిమాలో నటించేందుకు ఒప్పుకుంది ఊర్వశి. సో.. త్వరలోనే ఓ తెలుగు సినిమాతో సిల్వర్ స్క్రీన్ నిండుగా అందాలు ఆరబోయబోతోంది ఊర్వశి.