ఎన్నికలతో ముడిపడిన ఉస్తాద్!

- Advertisement -
Ustaad Bhagat Singh

ఆ మధ్య రాజకీయ పర్యటనలతో బిజీగా ఉండి సినిమాలను పక్కన పెట్టారు పవన్ కళ్యాణ్. ఇప్పుడు రాజకీయంగా కొంత వెసులుబాటు దొరకడంతో మళ్ళీ షూటింగులతో బిజీగా మారారు. ప్రస్తుతం ఆయన “ఉస్తాద్ భగత్ సింగ్” షూటింగ్ లో పాల్గొంటున్నారు. హైదరాబాద్ లోనే షూటింగ్ జరుగుతోంది.

ఈ షెడ్యూల్ పది రోజుల పాటు ఉంటుంది. వచ్చే నెలలో “ఓజీ” సినిమా షూటింగ్లో పాల్గొంటారు. “ఓజీ” ఇప్పటికే 50 శాతం షూటింగ్ పూర్తి చేసుకొంది. అక్టోబర్ లో కొన్ని రోజులు, నవంబర్ లో కొన్ని రోజులు పవన్ కళ్యాణ్ డేట్స్ ఇస్తే… ఆయనకి సంబంధించిన వర్క్ మొత్తం కంప్లీట్ అవుతుంది. ఆ తర్వాత సినిమాని ఎప్పుడు విడుదల చెయ్యాలనేది నిర్ణయిస్తారు.

ఇక “ఉస్తాద్ భగత్ సింగ్” మాత్రం వచ్చే ఏడాది సమ్మర్ ప్రారంభంలో ఎన్నికలకు కొద్ది రోజుల ముందు రావొచ్చు.

ఐతే, ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి అనేదాన్ని బట్టి ఇదంతా ఆధారపడి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి మార్చిలో కానీ, ఏప్రిల్ లో కానీ ఎన్నికలు జరగాలి. ఒకవేళ “వన్ నేషన్ వన్ ఎలెక్షన్” అన్న ప్రధాని మోదీ పాలసీ ప్రకారం ఎన్నికలు ముందే జరిగితే “ఉస్తాద్” విడుదల 2024 మే, జూన్ లో ఉంటుంది. ఒకవేళ ఏప్రిల్ లో ఎన్నికలు జరిగితే “ఉస్తాద్”ని మార్చిలో విడుదల చేసే అవకాశం ఉంటుంది.

 

More

Related Stories