- Advertisement -

ప్రముఖ నటుడు ఉత్తేజ్ ఇంట విషాదం చోటు చేసుకొంది. ఆయన భార్య పద్మావతి కన్నుమూశారు. చాలా కాలంగా హైదరాబాద్ లోని బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పద్మావతి ఈరోజు తుది శ్వాస విడిచారు.
ఆమె మరణ వార్త తెలియగానే మెగాస్టార్ చిరంజీవి, ప్రకాశ్‌రాజ్, జీవిత రాజశేఖర్ హుటాహటిన ఆస్పత్రికి చేరుకొన్నారు. ఉత్తేజ్‌ని, ఆయన కూతురుని ఓదార్చారు. పద్మావతి కూడా నటన శిక్షణ ఇచ్చేవారు. ఉత్తేజ్, పద్మావతిల కూతురు కూడా ఇటీవలే నటిగా పరిచయం అయ్యారు.
ఉత్తేజ్ ప్రకాష్ రాజ్ ప్యానల్ తరఫున ‘మా’ ఎన్నికల్లో నిలబడ్డారు.