టీవిలో కూడా “వి” ఫ్లాప్పే

V Movie

నాని, సుధీర్ బాబు నటించిన “వి” సినిమా థియేటర్ల బదులు డైరెక్ట్ గా అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయింది. ఇంద్రగంటి డైరెక్ట్ చేసిన ఈ మూవీని క్రిటిక్స్ చీల్చి చెండాడారు. సోషల్ మీడియాలో జనం కూడా సినిమాని ట్రోల్ చేశారు. ఆ సినిమాకి ఎన్ని వ్యూస్ వచ్చాయో, అమెజాన్ కి వర్క్ అవుట్ అయిందో లేదో మనకి తెలీదు. కానీ ఓవరాల్ గా సినిమాకి బాడ్ టాక్ వచ్చింది.

ఇక టీవీల్లో మొదటిసారి ప్రసారం చేస్తే వచ్చిన రేటింగ్ కూడా తక్కువ. అంటే బుల్లితెరపై కూడా ఫ్లాప్పే. డిసెంబర్ 6న జెమినీ టీవీ “వి” సినిమాని వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ప్రసారం చేసింది. కానీ ఆంధ్ర, తెలంగాణ అర్బన్ మార్కెట్ రేటింగ్ కేవలం 6.79 పాయింట్లు మాత్రమే. చాలా చాలా తక్కువ.

నాని వంటి హీరో రేంజుకి ప్రీమియర్ రేటింగ్ మినిమమ్ 10 పాయింట్స్ రావాలి. దీన్ని బట్టి ఈ సినిమాని బుల్లితెర ప్రేక్షకులు కూడా పట్టించుకోలేదు. నాని కెరీర్లో ఇది 25వ చిత్రంగా విడుదలైంది.

More

Related Stories