జ‌న‌వ‌రి 1న థియేట‌ర్స్‌లో ‘వి’

V Movie

నాని, సుధీర్‌బాబు హీరోలుగా రూపొందిన “వి” ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల అయింది. ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో దిల్‌రాజు, శిరీశ్‌, హ‌ర్షిత్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఇప్పుడు థియేటర్లలోకి వస్తోంది.

న్యూ ఇయర్ స్పెషల్ గా జనవరి 1 నుంచి థియేటర్లలో ప్రదర్శిస్తారు.

‘‘కోవిడ్ ప‌రిస్థితుల నేప‌థ్యంలో అమెజాన్‌లో విడుద‌ల చేశాం. నాని 25వ సినిమా ఇది. ఎంతో ప్రెస్టీజియ‌స్‌గా, రిచ్‌గా తెర‌కెక్కించాం. కానీ థియేట‌ర్స్‌లో సినిమాను విడుద‌ల చేయ‌లేక‌పోయామ‌నే ఆలోచ‌న ఉండిపోయింది. ఇప్పుడు థియేట‌ర్స్ ఓపెన్ అవుతున్నాయి. ఎంతో సంతోషించాల్సిన విష‌యం. ఈ నేప‌థ్యంలో రాబోయే కొత్త సంవ‌త్స‌రం అంద‌రికీ మంచి జ‌ర‌గాల‌ని, అంద‌రూ బావుండాల‌ని కోరుకుంటూ జ‌న‌వ‌రి 1న వి సినిమాను థియేట‌ర్స్‌లో విడుద‌ల చేస్తున్నాం,’ అన్నారు నిర్మాత దిల్ రాజు.

ఈ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌ను బిగ్ స్క్రీన్‌పై చూస్తే ఉండే ఫీల్ వేరుగా ఉంటుందట.

More

Related Stories