నిర్మాతల ఆఫీసుల్లో వ్యాక్సినేషన్

సామాన్య జనానికి వ్యాక్సిన్లు దొరకడం లేదు. ప్రైవేట్ లో కొందామన్నా కష్టంగా ఉంది. ఆరోగ్య సేతు, కోవిన్ ఆప్ లో ఎన్ని సార్లు చెక్ చేసినా వ్యాక్సిన్లు “0” అనే చూపిస్తుంటుంది. కానీ తెలుగు సినిమా ఇండస్ట్రీ, కార్పొరేట్ కంపెనీలు మాత్రం జోరుగా వ్యాక్సినేషన్ డ్రైవ్ లు మొదలుపెట్టాయి.

హైదరాబాద్ లో పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలు, తెలుగు సినిమా నిర్మాణ సంస్థలు, మీడియా సంస్థలు తమ సిబ్బందికి వ్యాక్సిన్లు వేయిస్తున్నాయి. ప్రైవేట్ గా కొనుక్కొనే సదుపాయం కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

గత నాలుగైదు రోజులుగా కోవిషీల్డ్, కోవాగ్జిన్ లు ఇస్తున్నారు నిర్మాతల ఆఫీసుల్లో. చాలా నిర్మాణ సంస్థలు తమ సిబ్బందికి, అసోసియేట్ డైరెక్టర్లకు, ప్రొడక్షన్ మేనేజర్లకు వ్యాక్సిన్లు వేయిస్తున్నాయి. ఫిలింనగర్, జూబ్లీహిల్స్, బంజరాహిల్స్ లో ఇప్పుడు ఇదే సందడి. ఇదే పద్దతి కొనసాగితే తెలుగు సినిమా పరిశ్రమలో పనిచేసే చాలామందికి మొదటి డోసు వ్యాక్సిన్ పూర్తి అవుతుంది. రెండో డోసు కూడా వచ్చే నెలలో పూర్తి అయితే ఇక షూటింగ్ లకు పెద్దగా ఇబ్బంది ఉండదు.

Advertisement
 

More

Related Stories