- Advertisement -
‘కేజీఎఫ్’ సినిమా సక్సెస్ కావడంతో కన్నడ హీరోలు అందరూ తెలుగులో తమ లక్ పరీక్షించుకుంటున్నారు. వరుసపెట్టి క్యూ కడుతున్నారు. లేటెస్ట్ గా కన్నడ యువ హీరో రిషి కూడా తెలుగులో ఎంట్రీ ఇస్తున్నాడు.
“వద్దురా సోదరా” అనే పేరుతో రూపొందుతోన్న ఈ చిత్రంలో ధన్య బాలకృష్ణ నాయికగా నటిస్తోంది. కొత్త తరహా ప్రేమకథతో దర్శకుడు ఇస్లాహుద్దీన్ “వద్దురా సోదరా” చిత్రాన్ని రూపొందించారట. ధీరజ్ మొగిలినేని, అమ్రేజ్ సూర్యవంశీ దీనికి నిర్మాతలు.
“వద్దురా సోదరా” సినిమా మోషన్ పోస్టర్ సోమవారం రిలీజ్ అయ్యింది.