వైష్ణవ్ తేజ్ ‘సుడి’!

Vaishnav Tej

‘మెగాస్టార్’ క్రికెట్ టీంలో కొత్త మెంబర్…. వైష్ణవ్ తేజ్. సాయి ధరమ్ తేజ్ తమ్ముడు… ఈ కుర్ర హీరో. మొదటి సినిమా…ఉప్పెన. ఇంకా విడుదల కాలేదు. కరోనా కారణంగా రిలీజ్ వాయిదా పడింది. ఐతే మొదటి సినిమా రిలీజ్ కాకముందే, రెండో సినిమా చిక్కింది. అది కూడా ఓ పెద్ద దర్శకుడితోనే కావడం అంటే మామూలు సుడి కాదు.

క్రిష్ డైరెక్షన్లో నటిస్తున్నాడిప్పుడు. రకుల్, వైష్ణవ్ జంటగా క్రిష్ సొంత డైరెక్షన్లో లేటెస్టుగా షూటింగ్ షురూ చేశాడు.

ఆ ఏముందిలే… మెగా మేనల్లుడు కాబట్టి ఆటోమాటిక్ గా అవకాశాలు వస్తాయి అనే కామెంట్లు ఆల్రెడీ పడుతున్నాయి. ఇందులో కొంత నిజముంది.వైష్ణవ్ తేజ్ నేపో కిడ్ కాబట్టి డైరెక్టర్ల చూపు జనరల్ గా వీరిపైనే ఉంటుంది అనేది కూడా వాస్తవమే. అయినప్పటికీ… నేపో కిడ్స్ అందరికి ఇలా పెద్ద ఆఫర్స్ ముందే దక్కవు. ఆ లెక్కన చూస్తే ఈ కుర్ర హీరో చాలా లక్కీ. వ్యవహారిక భాషలో చెప్పాలంటే… వైష్ణవ్ కి సుడి బాగానే ఉంది.

‘ఉప్పెన’ కేవలం థియేటర్లోనే విడుదల చెయ్యాలని నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ భావిస్తోంది. ఇక క్రిష్ మూవీ కూడా థియేటర్లోనే రానుంది.

More

Related Stories