గ్లామర్ షో కన్నా నటనకే ఓటు!

Vaishnavi Chaitanya

వైష్ణవి చైతన్య అచ్చ తెలుగు అమ్మాయి. ‘అల వైకుంఠపురంలో’ వంటి సినిమాల్లో చిన్న పాత్ర పోషించింది. అలాగే యూట్యూబర్ గా పాపులర్. ఇప్పుడు హీరోయిన్ అయింది. ‘బేబీ’ అనే సినిమాలో ఈ భామే హీరోయిన్.

హీరోయిన్ కావాలనే ఇండస్ట్రీకి వచ్చి…

నేను యూట్యూబర్‌గా, సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్‌గా కొంత పాపులారిటీ తెచ్చుకున్నాను. కానీ నేను ఈ ఇండస్ట్రీకి వచ్చిందే హీరోయిన్ కావాలనే. ఎనిమిదేళ్ళ ప్రయత్నాల తర్వాత ఇప్పుడు అవకాశం వచ్చింది. “బేబీ” సినిమాలో హీరోయిన్‌గా అవకాశాన్ని ఇచ్చారు దర్శకుడు సాయి రాజేష్ గారు. కథ విని షాక్ అయ్యాను.ఇది నాకు ఊహించని గొప్ప అవకాశం.

మ్యూజిక్ ఓరియెంటెడ్ కథ ఇది

బస్తీలో పుట్టి పెరిగిన అమ్మాయి కాలేజ్ లైఫ్ లోకి వచ్చాక జీవితం ఎలా మలుపు తిరిగింది అనేది కథ. ఆ జీవితం నుంచి ఏం నేర్చుకుంది? అనేది బాగా చూపించారు. సాయి రాజేష్ గారికి మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. అందుకే దీన్ని ఆయన మ్యూజిక్ ఓరియెంటెడ్ సినిమాగా మలిచారు.

తెలుగు అమ్మాయిలకు కూడా ఆఫర్లు వస్తున్నాయి!

తెలుగు అమ్మాయిలకు అవకాశాలు కొంత తక్కువే కానీ తెలుగు అమ్మాయి కాబట్టి అవకాశం ఇవ్వకూడదు అని దర్శకులు, నిర్మాతలు అనుకోరు. కాకపోతే ఇతర భాష హీరోయిన్లలా మన అమ్మాయిలు అవకాశాల కోసం ఎక్కువగా ప్రయత్నించరు. ఈ సినిమా విషయంలో నిర్మాత ఎస్‌కేఎన్ కష్టం ఎక్కువ. ఆయన సాయి రాజేష్ గారిని నమ్మారు. కథని, ఫ్రెండ్షిప్ ని నమ్మి తీశారు.

గ్లామర్ కూడా చేస్తా కానీ

గ్లామర్ పాత్రలకు వ్యతిరేకం కాదు కానీ నటనకు స్కోప్ ఉండే పాత్రలే ఇష్టం. అవి చేసేందుకు నా మొదటి ఓటు.

Advertisement
 

More

Related Stories