క్రిష్… ఆ మూవీ ఊసెత్తట్లేదు!

Vaishnav Tej

‘ఉప్పెన’ సినిమా విడుదలయి 50 రోజులు పూర్తి అయింది. ఈ మూవీ ఈ నెల 14న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కానుంది. ఈ సినిమా ద్వారా పరిచయమైన వైష్ణవ్ తేజ్ మూడో సినిమా ఈ రోజు ప్రారంభమైంది. కానీ ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న రెండో సినిమా సందడి లేదు.

గతేడాది సెప్టెంబర్ లో క్రిష్ వైష్ణవ్ తేజ్, రకుల్ జంటగా ఒక సినిమా తీశాడు. డిసెంబర్ లో షూటింగ్ పూర్తి చేశాడు. ‘ఉప్పెన’ రిజల్ట్ చూసి ఈ సినిమా ప్రచారం చేద్దామనుకున్నాడు. ‘ఉప్పెన’ బిగ్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. కానీ క్రిష్ మాత్రం ఆ మూవీ ఊసెత్తడంలేదు.

క్రిష్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హీరోగా ‘హరి హర వీరమల్లు’ సినిమా తీస్తున్నాడు. ఈ షూటింగ్ తో బిజీ గా ఉన్నాడు. బహుశా సమ్మర్ సినిమాల హడావిడి తగ్గాక వైష్ణవ్ ప్రొమోషన్ చేస్తాడేమో. పైగా ఈ సినిమాకి గ్రాఫిక్ వర్క్ ఎక్కువగా ఉంది. అది కూడా పూర్తి కావాలి. అందుకే టైం పడుతోంది.

More

Related Stories