వకీల్ సాబ్, రాధే శ్యామ్ మిగిలారు

Vakeel Saab

‘ఆర్ ఆర్ ఆర్’, ‘ఆచార్య’, ‘పుష్ప’, ‘నారప్ప’, ‘కేజీఎఫ్ 2’ …ఇలా పెద్ద సినిమాలన్నీ తమ రిలీజ్ డేట్స్ ని ప్రకటించాయి. గత నాలుగు రోజుల్లో దాదాపు 15 నుంచి 20 సినిమాల విడుదల తేదీలు ఖరారు అయ్యాయి. ఇందులో చిన్న చిత్రాలున్నాయి. పెద్దవీ వున్నాయి. ఇంత సందడి జరుగుతున్నా… పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతోన్న ‘వకీల్ సాబ్’, ప్రభాస్ నటిస్తోన్న ‘రాధే శ్యామ్’ గురించి క్లారిటీ రావడం లేదు.

‘వకీల్ సాబ్’ ఏప్రిల్ 9న విడుదల కావొచ్చు. కానీ ఆ డేట్ ని మాత్రం నిర్మాత దిల్ రాజు ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఇక ప్రభాస్ సినిమా ఎప్పుడొస్తుంది అనే విషయంలో ఎవరికీ క్లారిటీ లేదు. మే చివరి వారంలో విడుదల ఉండొచ్చనిపిస్తోంది. ఎందుకంటే జులై 2న ‘మేజర్’, జులై 16న ‘కేజీఫ్ 2’, జులై 30న ‘గని’, ఆగష్టు 13న ‘పుష్ప’, ఆగస్ట్ 27న ‘ఎఫ్ 3’, దసరాకి ‘ఆర్ ఆర్ ఆర్’ ఇలా అన్ని ఇంపార్టెంట్ డేట్స్ లాక్ అయ్యాయి.

మే చివరి వారంలో ఏ సినిమా ఇప్పటివరకు డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. రాధే శ్యామ్, వకీల్ సాబ్ కనుక అధికారకంగా డేట్స్ ప్రకటిస్తే కొన్ని చిన్న , మిడిల్ రేంజ్ సినిమాలు డేట్స్ మార్చుకుంటాయి. వాళ్ళు తొందరగా క్లారిటీ ఇస్తే బెటర్.

అలాగే, పూరి జగన్నాధ్, విజయ్ దేవరకొండ కాంబినేషన్లో రూపొందుతోన్న ‘లైగర్’ కూడా ఇంకా డేట్ చెప్పలేదు.

More

Related Stories