వకీల్ సాబ్ వల్ల ఉపయోగం లేనట్లే!

Pawan Kalyan and Venu Sriram


వకీల్ సాబ్ ఆడింది. దాంతో, దర్శకుడు వేణు శ్రీరామ్ దశ తిరిగింది అనుకున్నారు. కానీ, ఆ సినిమా విడుదలయ్యి 14 నెలలు అయినా దర్శకుడు వేణు శ్రీరామ్ కి ఇంకో మూవీ సెట్ కావడం లేదు. వేణు శ్రీరామ్ అనుకున్న కాంబినేషన్లు ఏవి వర్కవుట్ కాలేదు.

అల్లు అర్జున్ హీరోగా దిల్ రాజు నిర్మించాలన్న ‘ఐకాన్’ సినిమా ఆగిపోయింది. బన్ని ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ కావడంతో వేణు శ్రీరామ్ వంటి లోకల్ దర్శకులతో సెట్ కాదు. అందుకే, ఆ ప్రాజెక్టు అటకెక్కింది.

వేణు శ్రీరామ్ మళ్ళీ నానితోనే సినిమా ప్లాన్ చేస్తాడని టాక్. కానీ, అది కూడా టైం పట్టేలా ఉంది.

పెద్ద హీరోలతో హిట్ కొట్టినంత మాత్రానా డైరెక్టర్ల జాతకం మారిపోతుందనుకోవడానికి ఏమి లేదు. త్రివిక్రమ్ వంటి అగ్ర దర్శకుడే ‘అలా వైకుంఠపురంలో’ వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత మరో సినిమా చేసేందుకు రెండేళ్లు వెయిట్ చెయ్యాల్సి వచ్చింది. పెద్ద హీరోలతోనే సినిమాలు చెయ్యాలని భీష్మించుకొని కూర్చుంటే ఇలాగే ఉంటుంది.

 

More

Related Stories