అమెరికాలో మంచి వసూళ్లు

Vakeel Saab

అమెరికాలో కూడా కోవిడ్ భయం ఎక్కువగానే ఉంది. థియేటర్లలో ఇంకా 100 శాతం ఆక్యుపెన్సీని అనుమతివ్వడం లేదు. 50 నుంచి 75 శాతం ఆక్యుపెన్సీకి మాత్రమే పర్మిషన్ ఉంది. ఈ పరిస్థితుల్లోనూ ‘వకీల్ సాబ్’ దాదాపు మూడు లక్షల డాలర్ల వసూళ్లను సాధించింది.

ప్రీమియర్ షోల నుంచి ‘వకీల్ సాబ్’కి 297K డాలర్ల వసూళ్లు వచ్చాయి.

ఈ ఏడాది ఇంత భారీ మొత్తం పొందిన ఏకైక ఇండియన్ మూవీ ‘వకీల్ సాబ్’. విజయ్ నటించిన ‘మాస్టర్’ కానీ, ‘ఉప్పెన’, ‘జాతిరత్నాలు’ చిత్రాలు కానీ ఇంత ఓపెనింగ్ తెచ్చుకోలేదు. పవన్ కళ్యాణ్ కున్న క్రేజ్ వల్ల ఈ కోవిడ్ పరిస్థితులలో ఈ మొత్తం వచ్చింది.

సాధారణ పరిస్థితుల్లో ఈ వసూళ్లు తక్కువగానే చూడాలి. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఇది భారీ మొత్తమే. వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ బాలీవుడ్ లో హిట్టయిన ‘పింక్’ సినిమాకి రీమేక్. క్రిటిక్స్ అందరూ సెకండ్ హాఫ్ బాగుందని మెచ్చుకున్నారు. ఓవరాల్ గా ‘3’ సగటు రేటింగ్ వచ్చింది.

More

Related Stories