టీజర్లో రిలీజ్ డేట్ చెప్తారా?

Vakeel Saab

సంక్రాంతికి “వకీల్ సాబ్” టీజర్ రిలీజ్ అవుతుంది. ఇప్పటికే ఆ విషయాన్నీ ప్రకటించింది టీం. మరి, మూవీ రిలీజ్ ఎప్పుడు? ఏప్రిల్ మొదటివారంలో రిలీజ్ చెయ్యాలనేది నిర్మాత దిల్ రాజు ప్లాన్.

టీజర్ రిలీజ్ చేసినప్పుడే సినిమా విడుదల తేదీ కూడా ప్రకటిస్తారని ఒక టాక్. సమ్మర్ కి “రాధే శ్యామ్”, “కేజీ ఎఫ్ 2”, “ఆచార్య” వాటిన్సె ఇతర పెద్ద సినిమాలు కూడా ఉన్నాయి. సో…రిలీజ్ డేట్స్ ముందే బుక్ చేసుకోకపోతే కష్టం అవుతుంది. అందుకే దిల్ రాజు ఈ విషయంలో క్లారిటీ ఇస్తారని అంటున్నారు.

పవన్ కళ్యాణ్ సినిమా ఎప్పుడు విడుదలైనా…ఆ క్రేజ్ వేరుగా ఉంటుంది. కానీ నిర్మాత దిల్ రాజు ఈ సినిమాని ప్రెస్టీజియస్ గా తీసుకుంటున్నారు. శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ పాటలు కూడా ఒక్కోటి బయటికి వస్తాయి. ఇప్పటికే “మగువ” సాంగ్ వచ్చేసింది.

More

Related Stories