వకీల్ సాబ్ ఈవెంట్ ఖరారు

Vakeel Saab


‘వకీల్ సాబ్’ ప్రమోషన్స్ లలో వెనుకబడింది అన్న కామెంట్స్ వినపడగానే టీం అలెర్ట్ అయింది. ఇక వరుసగా పబ్లిసిటీ క్యాంపెన్ మొదలుపెట్టింది. ఈ రోజు ఈ సినిమా నుంచి మూడో పాట వచ్చింది. ‘కంటి పాప’ అనే ఈ సాంగ్ ని పవన్ కళ్యాణ్, శృతి హాసన్ పై చిత్రీకరించారు. ఇది ఒక డ్యూయెట్.

లేటెస్ట్ గా ప్రీ-రిలీజ్  ఫంక్షన్ కూడా ఖరారు చేశారు. ఏప్రిల్ 3న హైద్రాబాద్లో ఈ ఫంక్షన్ నిర్వహిస్తారు. గెస్టులెవరనేది ఇంకా ఖరారు కాలేదు.

మూడేళ్ళ లాంగ్ గ్యాప్ తర్వాత పవన్ కళ్యాణ్ నుంచి వస్తున్న మొదటి మూవీ… ‘వకీల్ సాబ్’. ఈ సినిమా బాలీవుడ్ లో హిట్టయిన ‘పింక్’ సినిమాకి రీమేక్. తమన్ సంగీతం అందించాడు. ‘మగువ’ అనే పాట బాగా క్లిక్ అయింది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ మూవీ ఏప్రిల్ 9న విడుదలవుతుంది.

More

Related Stories