
పవన్ కళ్యాణ్ “వకీల్ సాబ్” షూటింగ్ మళ్ళీ వాయిదా పడింది. డిసెంబర్ మొదటివారంలో మొదలు పెట్టి జనవరి మొదటివారంలోపు గుమ్మడికాయ కొట్టాలనుకున్న ప్లాన్ మళ్ళీ గతి తప్పింది. డిసెంబర్ రెండున పవన్ కళ్యాణ్ తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తారు. ఆ తర్వాత హైదరాబాద్ వచ్చి మళ్ళీ… రాజస్థాన్ పయనం అవుతారు.
డిసెంబర్ 9న నాగబాబు కూతురు నిహారిక పెళ్లి. ఉదయపూర్ లో డెస్టినేషన్ వెడ్డింగ్. అతిథిలందరూ మూడు రోజుల ముందే వెళ్లారట. సో… పెళ్లి నుంచి పవన్ కళ్యాణ్ వచ్చాకే షూటింగ్ కొత్త షెడ్యూలు మొదలవుతుంది. “వకీల్ సాబ్” పూర్తి అయ్యాకే, మిగతా సినిమాల షూటింగ్ గురించి ప్లాన్ చేస్తాడు.
డిసెంబరులోనే “అయ్యప్పనుం కోషియం” సినిమా రీమేక్ షురూ అవుతుందని జరిగిన ప్రచారం ఉత్తిదే. పవన్ కళ్యాణ్ సినిమాల షూటింగ్ షెడ్యూల్స్ మొత్తం ఆయన రాజకీయ ప్రణాళికలను బట్టి సాగాల్సిందే.