దీపావళికి కూడా టీజర్ డౌటే!

Pawan and Dil Raju

దసరాకు వకీల్ సాబ్ టీజర్ వస్తుందని అంతా అనుకున్నారు. “వకీల్ సాబ్ టీజర్ ఆన్ దసరా” అంటూ చాన్నాళ్లు ట్రెండింగ్ నడిచింది. అంతా జరిగిన తర్వాత తీరిగ్గా తూచ్ అన్నాడు దిల్ రాజు. అదే టైమ్ లో దీపావళికి టీజర్ అంటూ ఫీలర్ కూడా వచ్చింది.

ప్రస్తుతానికి పవన్ ఫ్యాన్స్ తో పాటు మీడియా మొత్తం వకీల్ సాబ్ టీజర్ దీపావళికి వస్తుందని ఫిక్స్ అయిపోయింది. కానీ ఈ విషయాన్ని నిర్మాత దిల్ రాజు ఇంకా అఫీషియల్ గా ఎనౌన్స్ చేయకపోవడం అనుమానాలు రేకెత్తిస్తోంది.

ప్రస్తుతం దీపావళి వీక్ లోకి ఎంటరయ్యాం. సరిగ్గా వారం ఉంది. ఈరోజు లేదా రేపు టీజర్ పై యూనిట్ నుంచి అధికారికంగా క్లారిటీ రావాలి. ఫలానా రోజున టీజర్ రిలీజ్ అంటూ పోస్టర్ రావాలి. కానీ అలాంటి ప్రయత్నం జరుగుతున్నట్టు కనిపించడం లేదు.

సంక్రాంతికి సినిమా వస్తుందా అన్నది ఇంకా క్లారిటీ లేదు. అందుకే… దిల్ రాజు ఊగిసలాడుతున్నట్లు టాక్. ఒకవేళ సంక్రాంతికి సినిమా రిలీజ్ కాకపోతే, ఇంత ఎర్లీగా టీజర్ రిలీజ్ చెయ్యడం వేస్ట్. ఒకవేళ సంక్రాంతికి పక్కాగా వస్తే మాత్రం టీజర్ రావొచ్చు.

Related Stories