దీపావళికే వకీల్ సాబ్ టీజర్?

- Advertisement -
Pawan Kalyan and Shruti Haasan

పవన్ కల్యాణ్ రీఎంట్రీ మూవీ “వకీల్ సాబ్” టీజర్ ఈ దసరాకు వస్తుందని చాలామంది ఊహించారు. దసరాను టార్గెట్ చేస్తూ టీజర్ వర్క్ స్టార్ట్ చేశారు కానీ ఎందుకో టీజర్ రిలీజ్ కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నారు.

దసరా బదులు దీపావళికి ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేయాలని అనుకుంటున్నారట. మేకర్స్ ఈ నిర్ణయం తీసుకోవడం వెనక ఓ రీజన్ ఉంది.

“వకీల్ సాబ్” మూవీ రిలీజ్ పై ఇంకా క్లారిటీ రాలేదు. రిలీజ్ డేట్ చెప్పమని నిర్మాత దిల్ రాజు పై చాలా వత్తిడి పెరుగుతోంది. దీనికి సంబంధించి పవన్ కల్యాణ్ తో ఆల్రెడీ చర్చిస్తున్నాడట దిల్ రాజు. రిలీజ్ డేట్ ఫిక్స్ చేయాలంటే పవన్ సెట్స్ పైకి రావాలి. త్వరలోనే సినిమా షూటింగ్ స్టార్ట్ చేస్తాడు పవన్ కళ్యాణ్. డిసెంబర్ రెండో వారానికి సినిమా షూటింగ్ ని కంప్లీట్ చెయ్యాలనేది పవన్ కళ్యాణ్ ప్లాన్.

సంక్రాంతి టార్గెట్?

ఈ సినిమాని సంక్రాంతి బరిలోనే దింపాలని ప్లాన్ చేస్తున్నారు నిర్మాత దిల్ రాజు. ఐతే, అది ఇప్పుడే చెప్పలేం. థియేటర్లు అన్ని మళ్ళీ స్టార్ట్ కావాలి. జనం థియేటర్లకు రావడం అలవాటు పడాలి. ఇలా ఇన్ని లింకులున్నాయి ఇందులో.ఒక్కసారి మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయితే, టీజర్ తోనే సినిమా విడుదల తేదీని కూడా చెప్పాలనేది యూనిట్ ప్లాన్. అందుకే ఈ ఆలస్యం అని టాక్.

 

More

Related Stories