
“వకీల్ సాబ్” కథ నిజానికి మాస్ హీరోకి సూటయ్యేది కాదు. “పింక్” అనే బాలీవుడ్ మూవీ ఆధారంగా రూపొందిన సినిమా ఇది. అమితాబ్ బచ్చన్ పోషించారు హీరో పాత్రని. సీరియస్ ఇష్యూ చుట్టూ తిరిగే కథ. అందులో ‘హీరో’ లాయర్. ఈ కథలోనూ హీరోయిజం చూపించొచ్చు అని అజిత్ తో రీమేక్ చేసిన తమిళ దర్శకుడు ప్రూవ్ చేశాడు.
ఇప్పుడు తెలుగులో దాన్ని మరింతగా రసవత్తరంగా మార్చినట్లు ఉన్నారు. దర్శకుడు వేణు శ్రీరామ్ … పవన్ కళ్యాణ్ ఇమేజ్ కి తగ్గట్లు ఆయన పాత్రని తీర్చిద్దినట్లు కనిపిస్తోంది. టీజర్ ని చూసినవారంతా పవన్ కళ్యాణ్ మళ్ళీ ఫామ్ లోకి వచ్చినట్లే అని అంటున్నారు.
“కాటమరాయుడు”, “అజ్ఞాతవాసి” చూశాక పవన్ కళ్యాణ్ ఫామ్ కోల్పోయినట్లు అనిపించింది. ఐతే, గ్యాప్ వచ్చినా… పవన్ కళ్యాణ్ ఇందులో బాగున్నారు. ఆయన ఆఫ్ స్క్రీన్ ఇమేజ్ కి తగ్గట్లే డైలాగ్ లు రాసినట్లు అనిపిస్తోంది.