వకీల్ సాబ్ తో రాకీ భాయ్ ఢీ!

వచ్చే సంక్రాంతికి రాబోయే పెద్ద సినిమా ఏదైనా ఉందంటే అది “కేజీఎఫ్2” మాత్రమే. ప్రస్తుతానికి ఈ పాన్-ఇండియా సినిమా మాత్రమే అధికారికంగా ప్రకటన చేసింది. మరో పెద్ద సినిమా నుంచి సంక్రాంతి రిలీజ్ స్టేట్ మెంట్ రాలేదు. అయితే టాలీవుడ్ లో రాకీ భాయ్ కు ఈసారి వకీల్ సాబ్ పోటీనిచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి

అన్నీ అనుకున్నట్టు జరిగితే “వకీల్ సాబ్” సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలని అనుకుంటున్నాడట నిర్మాత దిల్ రాజు. పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా సంక్రాంతికి షెడ్యూల్ అయితే.. ఇక ఈ రేసు నుంచి చాలా సినిమాలు తప్పుకోవడం ఖాయం.

‘రంగ్ దే’, ‘అల్లుడు అదుర్స్’, ‘ఉప్పెన’, ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ లాంటి సినిమాలు ఇప్పటికే సంక్రాంతి పోటీలో ఉన్నట్టు వార్తలొస్తున్నాయి. వీటిలో కొన్ని సినిమాలు సంక్రాంతిని టార్గెట్ చేస్తున్నట్టు ప్రకటించాయి కూడా. ‘వకీల్ సాబ్’ వస్తే ఇవన్నీ దాదాపు తప్పుకున్నట్టే. 

సో.. ఈ సంక్రాంతికి ‘వకీల్ సాబ్’కు గట్టి పోటీ ఏదైనా ఉందంటే అది యష్ నటిస్తున్న ‘కేజీఎఫ్2”మాత్రమే. వకీల్ సాబ్ సంక్రాంతికి వస్తుందంటూ దిల్ రాజు ఓ మాట చెబితే చాలు.. అన్నీ సైడ్ అయిపోతాయి. యష్-పవన్ మాత్రమే బరిలో నిలుస్తారు.

Related Stories