పైడిపల్లి పార్టీకి కదిలొచ్చిన స్టార్స్

వంశీ పైడిపల్లి మొన్న తన పుట్టిన రోజు సందర్భంగా పార్క్ హయత్ లో పెద్ద పార్టీ ఇచ్చారు. మెగాస్టార్ చిరంజీవి, తమిళ హీరో కార్తీ, కీర్తి సురేష్, సంగీత, దిల్ రాజు సహా పలువురు సెలెబ్రిటీలు విచ్చేశారు. ఇక సినిమా ఇండస్ట్రీలో ఉన్న యువ దర్శకులందరూ హాజరయ్యారు.

పైడిపల్లి త్వరలోనే విజయ్ హీరోగా పాన్ ఇండియా సినిమా డైరెక్ట్ చేస్తారు. పైడిపల్లి తన గ్రాఫ్ పెంచుకున్నాడన్నమాట. దాంతో ఆయన ఆకాశంలో విహరిస్తున్నారు. అందుకే, ఈ బర్త్ డేకి గ్రాండ్ పార్టీ ఇచ్చారు.

కరోనా సెకండ్ వేవ్ తగ్గింది. దాంతో మళ్ళీ సినిమా ఇండస్ట్రీలో నైట్ పార్టీలు పెరిగాయి. పార్క్ హయత్ హోటల్ సెలెబ్రెటీలకు ఫేవరిట్ అడ్డాగా మారింది.

 

More

Related Stories