వంశీ ఇక ‘ఆహా’తో బిజీ!

Vamshi Paidipally

దర్శకుడు వంశీ పైడిపల్లి కొత్త సినిమా ఎప్పుడు? ఇదొక ఆన్సర్ లేని ప్రశ్నగా మారింది. రెండేళ్ల క్రితం విడుదలైన ‘మహర్షి’ తర్వాత ఇప్పటివరకు ఇంకో సినిమా సెట్స్ పైకి తీసుకురాలేదు. మొదట మహేష్ బాబు మళ్ళీ సినిమా ఇస్తానని చెప్పి హ్యాండిచ్చాడు. ఆ తర్వాత ‘ఎవడు’ కాంబినేషన్ సెట్ ఇంకోసారి సెట్ చేద్దామని రామ్ చరణ్ కూడా లేటెస్ట్ గా శంకర్ సినిమా ఒప్పుకున్నాడు. దాంతో… పైడిపల్లి.. మరో రెండేళ్లు వెయిట్ చెయ్యాలి. లేదంటే ‘అఖిల్’లేదా ఇతర యంగ్ హీరోస్ తో ప్లాన్ చేసుకోవాలి.

హిట్ ఇవ్వడమే ఒక్కటే కాదు ‘కథలు’, ‘స్క్రిప్ట్స్’ బాగా రెడీ చేసుకోవాలి. అప్పుడే హీరోలు వెంటనే డేట్స్ ఇస్తారు… లేదంటే పెద్ద దర్శకులకు కూడా వెయిటింగ్ తప్పదు. అదే పైడిపల్లి సమస్య. తాను తయారు చేసుకున్న ‘కథ’లతో హీరోలను మెప్పించలేకపోయాడు.

వంశీ ప్రస్తుతం ‘ఆహా’కి క్రియేటివ్ ఇంపుట్స్ అందిస్తూ ఉన్నాడు.అక్కడే ఒక వెబ్ సిరీస్ కూడా తీస్తారని ఒక టాక్ కూడా నడుస్తోంది.

More

Related Stories