
దర్శకుడు వంశీ పైడిపల్లి పెద్ద చిత్రాల దర్శకుడు. ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, మహేష్ బాబు, కార్తీ, నాగార్జున… ఇలా పెద్ద హీరోలతోనే సినిమాలు తీశారు. ఇప్పుడు ఏకంగా కెరియర్ లోనే బిగ్గెస్ట్ మూవీ తీసేందుకు రెడీ అయ్యారు. తమిళ సూపర్ స్టార్ విజయ్ హీరోగా పాన్ ఇండియా సినిమా తీయనున్నారు వంశీ పైడిపల్లి. కరోనా సంక్షోభం ముగిశాక ఈ సినిమా సెట్స్ పైకి వస్తుంది.
ఈ సందర్భంగా వంశీ తన బలహీనతని ధైర్యంగా బయటపెట్టడం విశేషం. తాను రైటర్ ని కాదు అని ఓపెన్ గా చెప్పడం గ్రేట్. సొంతంగా కథలు చేసుకోలేను కాబట్టి తనకి సినిమాకి, సినిమాకి మధ్య విపరీతమైన గ్యాప్ వస్తోందని తెలిపారు. కథల విషయంలో ఆయన వేరే రైటర్లపై ఆధారపడుతారు. స్క్రీన్ ప్లే, టేకింగ్, మేకింగ్ తాను చూసుకుంటారు.
బీవీఎస్ రవి, కొరటాల శివ, వక్కంతం వంశీ, హరి, అహిసోర్ సాల్మన్… ఇలాంటి రైటర్లు అందించిన కథ, కథనాలపైనే ఆయన ఆధారపడ్డారు ఇప్పటివరకు. అందుకే, ఆయన సినిమా, సినిమా మధ్య చాలా గ్యాప్ వస్తోంది.