వారాహికి నంబరొచ్చింది

Pawan Kalyan

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన ఎన్నికల ప్రచారం కోసం ఒక ప్రత్యేక వాహనం సిద్ధం చేసుకున్నారని మనకు తెలుసు. ఐతే, ఈ వాహన రంగు విషయంలో వివాదం రేగింది. వాహనానికి వేసిన ఆలివ్ గ్రీన్ రంగు కేవలం సైనిక వాహనాలకు మాత్రమే వినియోగించాలి కాబట్టి ఆంధ్రప్రదేశ్ కి చెందిన అధికార పార్టీ నేతలు గోల చేశారు. ఈ బండికి రిజిస్ట్రేషన్ కూడా కాదని అన్నారు.

రోడ్డు ర‌వాణా చ‌ట్టం ప్ర‌కారం అన్నినిబంధ‌న‌లు పాటించిన ఈ వాహనానికి రిజిస్ట్రేషన్ చేశారు తెలంగాణ రవాణా అధికారులు. TS 13 EX 8384 అనే నంబర్ ని కేటాయించారు.

‘వారాహి’కి వేసిన పెయింట్ ఎమరాల్డ్ గ్రీన్, ఆలివ్ గ్రీన్ కాద‌ని అధికారులు వివ‌రించారు. అందుకే, అభ్యంతరం పెట్టాల్సింది లేదని క్లారిటీ ఇచ్చారు. జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయించిన తర్వాత ఎన్నికల ప్రచారానికి పవన్ కళ్యాణ్ ఈ వెహికిల్ ని ఉపయోగిస్తారు అని అంటున్నారు.

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కోసం తెలంగాణ రిజిస్ట్రేషన్ తో కూడిన వెహికిల్ నే వాడనున్నారు పవన్ కళ్యాణ్. ఎందుకంటే ఆయన నివాసం ఉండేది హైదరాబాద్ లో కాబట్టి ఆయన స్వంత వాహనాలు అన్నీ దాదాపుగా హైదరాబాద్ లోనే రిజిస్టర్ అవుతాయి. ఇక కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయానికి గతంలో రెండుసార్లు వెళ్లి పూజలు చేశారు పవన్ కళ్యాణ్.

Advertisement
 

More

Related Stories