వేరే వాటికి టైంలేదు: వరలక్ష్మి

తమిళ భామ వరలక్ష్మీ శరత్ కుమార్ తెలుగులో తెగ బిజి అయిపొయింది. ప్రత్యేక పాత్రలు, విలన్ రోల్స్… ఇలా తెలుగులో వైవిధ్యంగా సాగుతోంది ఆమె కెరీర్. ఆమె నటించిన మరో తెలుగు చిత్రం…యశోద. సమంత హీరోయిన్. ఇందులో ఆమె ఒక సరోగసీ ఫెసిలిటీ సెంటర్ అధినేత పాత్ర పోషించారు. సమంత తరవాత సెకండ్ లీడ్ లాంటి పాత్ర.

“కథ విన్నప్పుడే ఆశ్చర్య పోయాను. ఇటువంటి క్యారెక్టర్లను ఎలా రాశారు అని దర్శకులను అడిగా. నా పాత్ర భిన్నంగా ఉంటుంది. నా రియల్ లైఫ్ స్వభావానికి కి పూర్తి భిన్నమైన పాత్ర,” అని చెప్పింది.

హీరోయిన్ నయనతార సరోగసీలో పిల్లలను కనడం వివాదస్పదమైంది. మరి ఈ కథ గురించి అడిగినప్పుడు వరలక్ష్మి డిప్లమాటిక్ గా స్పందించింది. “కొంతమంది యాక్టర్స్ సరోగసీని ఆశ్రయించడం వల్ల డిస్కషన్స్ జరుగుతున్నాయి. పిల్లలు లేని చాలా మందికి సరోగసీ ద్వారా పొందే అవకాశం కలుగుతోంది. ఈ కథలో సరోగసీ ఒక టాపిక్ అంతే! అందులో మంచి చెడుల గురించి చెప్పడం లేదు,” అని వివరించింది.

తెలుగులో ఆమె బిజీగా ఉంది. తెలుగులో ఎక్కువ సినిమాలు చేస్తోంది. “అందుకే, నేను తమిళ సినిమాలు కూడా ఒప్పుకోవడం లేదు. ఇతర భాషల నుంచి ఆఫర్లు వస్తున్నాయి. కానీ, వేరే సినిమాలు చేసేందుకు టైం లేదు. పూర్తిగా తెలుగుపైనే ఫోకస్,” అని చెప్పింది.

బాలయ్య హీరోగా రూపొందుతోన్న ‘వీర సింహా రెడ్డి’లో ఆమె కీలక పాత్ర పోషిస్తోంది.

 

More

Related Stories