ఆ లోపే చేసుకోవాలనేది టార్గెట్!

Varalaxmi Sarathkumar engagement

వరలక్ష్మి శరత్ కుమార్ ఇటీవలే తన ప్రియుడితో నిశ్చితార్థం జరుపుకొంది. 14 ఏళ్లుగా స్నేహం ఉన్న నికొలాయి అనే గ్యాలరిస్టుతో ఆమె పెళ్లి జరగనుంది.

వరలక్ష్మి శరత్ కుమార్ కిప్పుడు 39 ఏళ్ళు.40లోపే పెళ్లి చేసుకోవాలని ఆమె టార్గెట్ గా పెట్టుకుందట. అందుకే ఈ ఏడాది పెళ్లి చేసుకుంటోంది. వచ్చే ఏడాది 40వ పుట్టినరోజు జరుపుకోవాల్సి ఉంటుంది. ఆ బర్త్ డేని తన భర్తతో కలిసి సెలెబ్రేట్ చేసుకుంటుందట.

ఆమె 2012లో తమిళ సినిమాల ద్వారా ఎంట్రీ ఇచ్చింది. మొదట బరువు సమస్యతో ఇబ్బంది పడింది. ఇటీవల బాగా సన్నబడింది. ఆరోగ్య సమస్యలు కూడా కొలిక్కి వచ్చాయి. అందుకే ఇప్పుడు పెళ్ళికి ముహూర్తం ఫిక్స్ చేసుకొంది.

ఆమె తెలుగులో ఇంకా కొత్తగా ఏ సినిమా ఒప్పుకోలేదు. ఇటీవలే ఆమె “హనుమాన్” సినిమాలో నటించింది. ఆ సినిమా కథలో ఆమె పాత్ర చనిపోయింది. సో, సీక్వెల్లో ఆమె నటించాల్సిన అవసరం లేదు. ప్రస్తుతానికి ఆమె సినిమాలు కొత్తగా ఒప్పుకోలేదు. కానీ పెళ్లి తర్వాత సినిమాలు మానెయ్యాలనే ఆలోచనలో లేదంట. తెలుగులో సినిమాలు కంటిన్యూ చేస్తాను అంటోంది.

Advertisement
 

More

Related Stories