పెళ్లి కోసం కాదంట!

వరలక్ష్మి సన్నబడింది. ఆమె ప్రస్తుతం తెలుగులో నటిస్తున్న సినిమాల్లో ఆమె పాత్రలన్నీ విలన్ తరహాలో సాగేవే. ఆమె తెలుగులోనే బిజీగా ఉంది. మరి అలాంటప్పుడు ఆమె సన్నని తీగలా మారిపోవాల్సిన అవసరం లేదు. విలన్ పాత్రలకు గ్లామర్ సొంపులు అక్కర్లేదు.

దాంతో, ఆమె సన్నబడ్డానికి కారణం పెళ్లి కోసమేనా అన్న డౌట్ చాలా మందికి వచ్చింది. అదే ప్రశ్న ఆమెని చాలా మంది అడిగారట. “పెళ్లి కోసం కాదు. నాకు బాయ్ ఫ్రెండ్ లేడు. పెళ్లి సంబంధమూ కుదరలేదు,” అని కుండబద్దలు కొట్టినట్లు చెప్పింది.

ఆమెకి 37 ఏళ్ళు. 40కి చేరువలోకి వస్తోంది కాబట్టి ఇప్పటినుంచే హెల్త్ పై దృష్టిపెట్టి బరువు తగ్గిందట. ఇక మళ్ళీ లావు కావొద్దని నిర్ణయం తీసుకుందట.

ప్రస్తుతం సినిమాలతో బిజీ

వరలక్ష్మి ప్రస్తుతం బాలయ్య నటిస్తున్న కొత్త చిత్రంలో కీలక పాత్ర పోషిస్తోంది. ఇంకో రెండు సినిమాలు కూడా సైన్ చేశారు.

గతంలో వరలక్ష్మి హీరో విశాల్ తో సహజీవనం చేసింది. కానీ, వారి బంధం ఎక్కువ కాలం కొనసాగలేదు. విశాల్ కి కూడా ఇంకా పెళ్లి కాలేదు. వరలక్ష్మి తండ్రి శరత్ కుమార్ ప్రస్తుతం తండ్రి పాత్రలు పోషిస్తున్నారు.

Advertisement
 

More

Related Stories