వెరైటీ ‘మాట’తో ఎన్టీఆర్ ఫ్యాన్స్ జోష్

NTR as Komaram Bheem


హాలీవుడ్ లో బాగా ప్రభావం చూపే మేగజైన్/వెబ్ సైట్ లలో ఒకటి ‘వెరైటీ’. ఈ మీడియా గ్రూప్ తాజాగా ఈ సారి (2023 మార్చిలో అవార్డుల ప్రదానం) ఆస్కార్ పోటీలో ఉండే చిత్రాలు, నటుల లిస్ట్ ని ప్రకటించింది. అంటే, అంచనా వేసే జాబితా.

తాజాగా ఈ లిస్ట్ లో ఎన్టీఆర్ పేరుని చేర్చింది. ఉత్తమ నటుల జాబితాలో ఎన్టీఆర్ పేరు ఉంటుంది అని అంచనా వేస్తూ ఒక లిస్ట్ ని పెట్టింది. ఈ లిస్ట్ లో ఎన్టీఆర్ పేరు ఉండడంతో యంగ్ టైగర్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ అంటూ ట్యాగ్ చేస్తూ సోషల్ మీడియాలో హంగామా చేస్తున్నారు.

ఇది కేవలం ‘వెరైటీ’ మేగజైన్ క్రిటిక్స్, జర్నలిస్టుల అంచనా మాత్రమే. దీనివల్ల ఆస్కార్ అవార్డు రాదు. కానీ బాగా ప్రభావం చూపే వెబ్ సైట్ కావడంతో నామినేషన్ టైంలో ఇది హెల్ప్ అవుతుంది. అందుకే, ఎన్టీఆర్ నటన విదేశీ క్రిటిక్స్ కి కూడా నచ్చిందని జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఖుషీగా ఉన్నారు. “ఆర్ ఆర్ ఆర్” సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరూ కథానాయకులుగా నటించారు. ఎన్టీఆర్ పేరుని మాత్రమే ఉత్తమ నటుల జాబితాలో ఉంచింది ఈ మేగజైన్.

మరోవైపు, హాలీవుడు దర్శకులు, రచయితలు, మేకర్స్ “ఆర్ ఆర్ ఆర్” బాగా నచ్చిందంటూ వరుసగా ట్వీట్లు వేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో జరుగుతున్న రచ్చ, హాలీవుడులో “ఆర్ ఆర్ ఆర్” హంగామా చూస్తుంటే ఈ సినిమా ఆస్కార్ సమయంలో బాగా ట్రెండ్ అవడం ఖాయంగా కనిపిస్తోంది. భారతదేశం ఎన్నో గొప్ప చిత్రాలు నిర్మించింది. కానీ మనకు ఇంతవరకు ‘ఉత్తమ విదేశీ చిత్రం’ అవార్డు రాలేదు. అది “ఆర్ ఆర్ ఆర్”తో సాధ్యం అవుతుందా?

ప్రస్తుత ట్రెండ్ ని చూస్తుంటే ఈ సినిమాకి నామినేషన్ దక్కేలా ఉంది. అది జరిగినా చాలా గొప్ప.

 

More

Related Stories