
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి జనాల్ని పిచ్చోళ్లను చేశాడు. ఈరోజు “థ్రిల్లర్” అనే సినిమా రిలీజ్ చేసిన ఈ దర్శకుడు.. ఆల్ మోస్ట్ ఓ షార్ట్ ఫిలింను తలపించాడు. అరగంట రన్ టైమ్ కూడా లేని ఈ వీడియోను సినిమాగా చెప్పుకొచ్చిన వర్మ.. ట్రయిలర్ లో మినహా సినిమాలో మేటర్ ఉండదని మరోసారి తన ట్రేడ్ మార్క్ చాటుకున్నాడు.
అటుఇటుగా 25 నిమిషాలున్న ఈ “సినిమా”తో వర్మ ఏం చెప్పాడనేది ఇక్కడ అప్రస్తుతం. ఆయన మరోసారి తనకు తెలిసిన కెమెరా యాంగిల్స్ చూపించాడు. తన క్రియేటివిటీ మొత్తాన్ని హీరోయిన్ అప్సర కాళ్లు, నడుము చూపించడానికే కేటాయించాడు.
Also Read: అప్సర…వర్మ మార్క్ గిమ్మిక్!
ఇంకా చెప్పాలంటే ఉన్న తక్కువ రన్ టైమ్ లోనే సగం రన్ టైమ్ అప్సర కాళ్లు, నడుము తినేశాయి. ఇక మిగిలిన 10 నిమిషాల్లో తను చెప్పాల్సింది చెప్పాడు. ఓవరాల్ గా చెప్పాలంటే.. ఈరోజు రిలీజైన “థ్రిల్లర్” కంటే ఆమధ్య వచ్చిన “నగ్నం”, “క్లైమాక్స్” సినిమాలు చాలా బెటరేమో అనిపిస్తుంది.