ఈ సారైనా బొల్లమ్మకు కలిసొస్తుందా?

తొలి ప్రయత్నంలో సక్సెస్ అందుకోలేకపోయింది. రెండో ప్రయత్నంలో కూడా నిరాశ ఎదురైంది. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి ఆశలు పెట్టుకుంది బబ్లీ బ్యూటీ వర్ష బొల్లమ్మ. ఆమె నటించిన “మిడిల్ క్లాస్ మెలొడీస్” సినిమా మరో 10 రోజుల్లో (20న) ఓటీటీలో రిలీజ్ అవ్వబోతోంది.

తెలుగులో “చూసీచూడంగానే” అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది వర్ష. రాజ్ కందుకూరి తన కొడుకును హీరోగా పరిచయం చేస్తూ నిర్మించిన ఆ సినిమా ఫ్లాప్ అవ్వడంతో వర్షకు కలిసిరాలేదు. ఆ తర్వాత శర్వానంద్ హీరోగా నటించిన “జాను” సినిమాలో సెకెండ్ హీరోయిన్ గా నటించింది. కచ్చితంగా హిట్టవుతుందనుకున్న ఆ సినిమా కూడా ఈమెకు కలిసిరాలేదు.

ఇప్పుడు “మిడిల్ క్లాస్ మెలొడీస్” సినిమాతో అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది వర్ష బొల్లమ్మ. ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన ఈ సినిమా కచ్చితంగా తనకు పేరు తీసుకొస్తుందని గట్టిగా చెబుతోంది.

ఈమధ్య ఓటీటీలో రిలీజ్ అవుతున్న సినిమాలన్నీ వరుసగా బాల్చీ తన్నేస్తున్నాయి. వర్ష అదృష్టం ఎలా ఉందో చూడాలి.

Related Stories