కెన్యాలో వరుణ్, ఫ్రాన్స్ లో చరణ్

- Advertisement -
Varun and Ram Charan

రామ్ చరణ్, ఆయన భార్య ఇటీవలే ఫ్రాన్స్ వెళ్లారు. కూతురు పుట్టిన తర్వాత మొదటిసారిగా వెకేషన్ కి వెళ్లారు. ప్రస్తుతం ఈ జంట ఫ్రాన్స్ లో విహరిస్తోంది. అక్కడి నుంచి వచ్చాక రామ్ చరణ్ శంకర్ తీస్తున్న “గేమ్ ఛేంజర్” షూటింగ్ లో పాల్గొంటారు.

“గేమ్ ఛేంజర్” సినిమా షూటింగ్ అలా సా……. గుతోంది. ఎప్పుడు పూర్తి అవుతుందో తెలియదు. అందుకే, గ్యాప్ లో ఏమి చెయ్యాలో తెలియక చరణ్ టూర్లు వేస్తున్నారు.

ఇక త్వరలో ఓ ఇంటివాడు కానున్న రామ్ చరణ్ సోదరుడు (కజిన్) వరుణ్ తేజ్ కూడ వెకేషన్ లో ఉన్నాడు. వరుణ్ తేజ్, ఆయన తల్లితండ్రులు, సోదరి నిహారిక కలిసి కెన్యాలో విహరిస్తున్నారు. ఎప్పటి నుంచో కెన్యా వెళ్ళాలనుకున్నాం ఇప్పటికీ కుదిరింది అని నిహారిక ఇన్ స్టాగ్రామ్ లో ఫోటోలు షేర్ చేసింది.

ఇక వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల పెళ్లి నవంబర్ లో ఇటలీలో జరిగే అవకాశం ఉంది.

 

More

Related Stories