
ఇటీవల హైదరాబాద్ లో జరిగిన పబ్ రైడ్ లో నిహారిక పేరు ప్రముఖంగా మీడియాలో రావడంతో మెగా కుటుంబ సభ్యులు అందరూ షాక్ లో ఉన్నారు. ముఖ్యంగా హీరో వరుణ్ తేజ్ చాలా ఇబ్బంది పడుతున్నాడట. చెల్లెలు నిహారిక అంటే వరుణ్ కి ప్రాణం. అదీ కాకుండా, ఇప్పుడు తన సినిమా ‘గని’ విడుదలకు సిద్ధంగా ఉండడంతో సమస్య వచ్చింది.
ఈ సినిమా ఇంటర్వ్యూలలో మీడియా ఆ పబ్ రైడ్ గురించి అడగకుండా చూసుకునేలా ప్లాన్ చేసుకోవాలి. అది ఇప్పుడు ఆయన ముందున్న సమస్య. ఈ సినిమాకి బాగా హైప్ తీసుకురావాలని వరుణ్ ప్రయత్నిస్తున్న వేళ ఈ పబ్ రైడ్ జరిగింది. నిహారిక డ్రగ్స్ తీసుకోలేదు, ఆమె విషయం వరకు క్లియర్ అని ఇప్పటికే నాగబాబు వివరణ ఇచ్చారు. కాకపోతే, మీడియా ప్రశ్నలు ఇబ్బంది పెడుతాయి.
అందుకే, వరుణ్ ఆ విషయంలో జాగ్రత్తగా డీల్ చెయ్యాలని ప్రయత్నిస్తున్నాడు. ‘గని’ కోసం రెండేళ్లు కష్టపడ్డాడు వరుణ్. అనేకసార్లు సినిమా వాయిదా పడింది. బజ్ తెద్దామనుకునే టైంకి ఈ సమస్య వచ్చింది.
మరోవైపు, వరుణ్ తేజ్ వచ్చే నెలలో ‘ఎఫ్ 3’ సినిమా ప్రొమోషన్ కూడా చెయ్యాలి.