వరుణ్ తాత కన్నుమూత

“హ్యాపీ డేస్”, “కొత్త బంగారు లోకం” ఫేమ్ వరుణ్ సందేశ్ ఇంట విషాదం. వరుణ్ సందేశ్ తాతయ్య జీడిగుంట రామచంద్రమూర్తి కరోనా వ్యాధితో కన్నుమూశారు. రామచంద్రమూర్తి పేరొందిన రచయిత. ఆల్ ఇండియా రేడియోలో పని చేశారు. అలా జనానికి బాగా పరిచయం అయింది ఆయన పేరు.

జీడిగుంట రామచంద్రమూర్తి “పునరపి”, “మనోయజ్ఞం” వంటి పలు టీవీ సీరియల్స్ కి కూడా రైటర్. అలాగే దుక్కిపాటి మధుసూదన్ రావు తీసిన “అమెరికా అబ్బాయి” సినిమాకి కథ అందించారు. ఆయన పెద్ద కుమారుడు విజయసారధి కొడుకే… వరుణ్ సందేశ్.

Related Stories