పెళ్లాం లేకపోయినా ఫ్రస్ట్రేషన్ వచ్చేసింది

పెళ్లాలు వాళ్లతో వచ్చే ఫ్రస్ట్రేషన్లను ఎఫ్2లో చూపించారు. ఎఫ్3లో మనీ కాన్సెప్ట్ ఎంచుకున్నప్పటికీ.. భార్యల ద్వారా వచ్చే ఫ్రస్ట్రేషన్ నే ఇందులో కూడా చూపించారు. పెళ్లయిన వెంకీ బాగానే చేసేశాడు. మరి పెళ్లి కానీ వరుణ్ తేజ్ ఎలా చేయగలిగాడు. ఇదే ప్రశ్న వరుణ్ తేజ్ కు ఎదురైంది. దానికి అతడిచ్చిన సమాధానం ఇది.

“నాకింకా పెళ్లి కాలేదు. కానీ ఎఫ్2, ఎఫ్3లో చాలా బాగా ఫ్రస్ట్రేషన్ చూపించానని అంటున్నారు. వెంకటేష్ గారికి పెళ్లయింది కాబట్టి ఆయన ఇబ్బంది పడలేదు. ఇక నా విషయానికొస్తే, నేను పక్కన ఉన్నోళ్లని చూసి నేర్చుకున్నాను. దిల్ రాజు, అనీల్ రావిపూడి, అలీ.. వాళ్ల ఇంట్లో ఎలా ఫ్రస్ట్రేషన్ ఫీల్ అవుతారో నాకు తెలుసు. వాళ్లను చూసి నేను నేర్చుకున్నాను. సినిమాలో అదే చేసి చూపించాను.”

అలా వాళ్లను చూసి ఫ్రస్ట్రేషన్ ను ఎలా నటించాలో నేర్చుకున్నానని సరదాగా చెప్పుకొచ్చాడు వరుణ్ తేజ్. ఎఫ్3 సినిమాకు సంబంధించి ప్రచారం పీక్ స్టేజ్ కెళ్లింది. యూనిట్ మొత్తం ప్రచారం కోసం మరోసారి కలిశారు. సినిమాకు గట్టిగా ప్రచారం చేస్తున్నారు.

ఎఫ్3లో మనీ ప్లాంట్ తో వంటకాలు చేసినట్టు ట్రయిలర్ లో చూపించారు. దానికి వెంకీ ఫ్రస్ట్రేషన్ ఫీల్ అవుతాడు. ఇది నిజజీవితంలో కూడా అతడికి ఎదురైంది. ప్రమోషన్ లో భాగంగా ఓ మహిళ, నిజంగానే మనీ ప్లాంట్ తో చేసిన వంటకాన్ని తీసుకొచ్చి వెంకీకి అందించింది. దేవుడికి దండం పెడుతూ, వెంకటేష్ ఆ వంటకాన్ని రుచిచూశాడు. బాగుందని ఆ మహిళను మెచ్చుకున్నాడు.

Advertisement
 

More

Related Stories