“వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్లికి ముహూర్తం కుదిరింది… “, “ఆగస్టు 24న వరుణ్ తేజ్ పెళ్లి… ఆగస్టు 25న ఆయన కొత్త సినిమా గాండీవధారి అర్జున విడుదల” … ఇలాంటి హెడ్ లైన్స్ తో మీడియాలో వార్తలు చెలరేగాయి. తీరా చూస్తే ఇది ఉత్తదే అని తేలింది.
వరుణ్ తేజ్, లావణ్యల పెళ్లి ఆగస్టులో కాదు. ఇంకా పక్కాగా ముహూర్తం ఫిక్స్ చెయ్యలేదు. నవంబర్ – డిసెంబర్ లో ఉంటుంది అని వరుణ్ తేజ్ సన్నిహితులు చెప్తున్నారు. ప్రస్తుతం వీరు ఇటలీలో ఒక మంచి రిసార్ట్ బుక్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. నవంబర్ లో మూడు రోజుల పాటు మంచి రిసార్ట్ దొరికితే అప్పుడే పెళ్లి ఉంటుంది.
ముందు పెళ్లి వెన్యూ కోసం వారి అన్వేషణ సాగుతోంది. వరుణ్ తేజ్, లావణ్య తమ ఎంగేజ్ మెంట్ కాకముందే ఇటలీలో పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యారట. అక్కడ వారికి మంచి జ్ఞాపకాలు ఉన్నాయి. ప్రేమించుకునే రోజుల్లోనే వారు ఇటలీకి తరుచుగా వెళ్లారట.
అందుకే, వెన్యూ ఫిక్స్ అయితే నవంబర్ లో ఉండే మంచి ముహూర్తం చూసుకొని పెళ్లి చేసుకుంటారు. ఆగస్టులో పెళ్లి అనేది ఉత్తుత్తి కబురే.