బాక్సర్ కాదు.. ఫైటర్ కాదు!

కొన్ని సినిమాలు సెట్స్ పైకి వచ్చి, చాన్నాళ్లుగా షూటింగ్స్ కూడా జరుపుకుంటూ ఉంటాయి. కానీ ఎన్ని రోజులైనా ఆ సినిమాకు పేర్లు పెట్టరు. ఈలోగా కొన్ని టైటిల్స్ వాటికి ఫిక్స్ అయిపోతాయి. అభిమానులు, ప్రేక్షకులే ఆ సినిమాలకు పేర్లు పెట్టేస్తారు. అలాంటి రెండు సినిమాలు ఇప్పుడు సెట్స్ పై ఉన్నాయి.

వీటిలో ఒకటి ”ఫైటర్”. విజయ్ దేవరకొండ, పూరి జగన్నాధ్ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాకు ఇంకా టైటిల్ ఫిక్స్ చేయలేదు. టైటిల్ ఎనౌన్స్ చేద్దామనుకునేలోపు కరోనా వచ్చింది. దీంతో అన్ని ప్రచార కార్యక్రమాలు పక్కనపెట్టేశారు. అయితే ఈ సినిమాకు ”ఫైటర్” అనే టైటిల్ చాన్నాళ్లుగా ప్రచారంలో ఉంది. ప్రస్తుతానికైతే ఈ సినిమా టైటిల్ అది కాదు.

ఇలాంటిదే మరో సినిమా ”బాక్సర్”. వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా పేరు కూడా బాక్సర్ కాదు. కేవలం వర్కింగ్ టైటిల్ మాత్రమే. ఇలా ఈ రెండు సినిమాలు ప్రేక్షకులు, అభిమానులు పెట్టిన టైటిల్స్ తో ఫిక్స్ అయిపోయాయి. రాబోయే రోజుల్లో ఈ సినిమాలకు కొత్త టైటిల్స్ పెట్టినా జనాలు యాక్సెప్ట్ చేయరేమో.

More

Related Stories