ఒకే సినిమాలో అందరి హీరోల స్టెప్పులు

చిరంజీవి పేరు చెప్పగానే కొన్ని సిగ్నేచర్ స్టెప్పులు గుర్తొస్తాయి. అలానే హృతిక్ రోషన్, షారూక్, నాగార్జున, లాంటి హీరోల పేర్లు చెప్పగానే వాళ్లకు మాత్రమే సొంతమైన కొన్ని డాన్స్ మూమెంట్స్ గుర్తొస్తాయి. ఇప్పుడీ మూమెంట్స్ అన్నింటినీ ఒకే సినిమాలో చూపించబోతున్నాడు దర్శకుడు అనీల్ రావిపూడి. అది కూడా చాలా ఫన్నీగా.

“ఎఫ్3 సినిమాలో వెంకటేష్ కు రేచీకటి, వరుణ్ తేజ్ కు నత్తి పెట్టాం. నత్తిగా డైలాగ్ చెప్పినప్పుడు చిన్న గ్యాప్ వస్తుంది కదా. ఆ గ్యాప్ ను కవరం చేయడం కోసం వరుణ్ తేజ్ రకరకాల స్టెప్పులేస్తుంటాడు. ట్రయిలర్ లో మీరు చూసినవి జస్ట్ శాంపిల్ మాత్రమే. దాదాపు అందరి హీరోల స్పెప్పులు ఈ సినిమాలో కనిపిస్తాయి. నత్తితో పాటు ఆ మూమెంట్స్ అన్నీ వచ్చేస్తాయి.”

ఇలా అసలు విషయం బయటపెట్టాడు అనీల్ రావిపూడి. సినిమాలో చాలా ఫ్రస్ట్రేషన్ ఉంటుందంటున్న రావిపూడి.. ఆ ఫ్రస్ట్రేషన్ నే జనాలు కామెడీగా ఫీల్ అవుతారని నమ్మకంగా చెబుతున్నాడు. ఈ సినిమా ప్రచారం ఊపందుకుంది. ఓవైపు లిరికల్ వీడియోస్ రిలీజ్ చేస్తూనే, మరోవైపు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు.

ముందుగా సునీల్, ప్రగతి లాంటి నటులతో ఇంటర్వ్యూలు ప్లాన్ చేసిన యూనిట్.. ఇప్పుడు ఏకంగా హీరోల్ని రంగంలోకి దించింది. తాజాగా అనీల్, వెంకీ, వరుణ్ తేజ్ కలిసి ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో చాలా విశేషాలు బయటపెట్టారు.

 

More

Related Stories