వరుణ్ కి 12 కోట్లు కావాలా?

Varun Tej

వరుణ్ తేజ్ కూడా మంచి సక్సెస్ లతో సాగుతున్నాడు. దాంతో ఈ యువ హీరో కూడా ఎక్కువ పారితోషికం కోరుకుంటున్నాడు. “ఎఫ్ 3” సినిమాకి వరుణ్ తేజ్ భారీగా రెమ్యూనరేషన్ అడుగుతున్నాడు అన్న విషయాన్ని తెలుగుసినిమా.కామ్ ఇంతకుముందే తెలిపింది.

తాజా సమాచారం ప్రకారం… వరుణ్ తేజ్ “ఎఫ్ 3” సినిమాకు మరో హీరో వెంకటేష్ కి సమానంగా అడుగుతున్నాడట. అంటే దాదాపు 12 కోట్లు ఇవ్వాలన్నమాట. వరుణ్ తేజ్ ఇప్పటివరకు 7 నుంచి 8 కోట్లు తీసుకుంటున్నాడు. ఇప్పుడు ఏకంగా నాలుగు కోట్లు ఎక్కువ. కరోనా కారణంగా హీరోలందరూ 20 శాతం తగ్గించాలని దిల్ రాజ్ తో కూడిన “ఆక్టివ్ ప్రొడ్యూసర్ గిల్డ్” ఆదేశాలు ఇచ్చింది. కానీ దిల్ రాజు నిర్మిస్తున్న సినిమాకే హీరోలు పారితోషికాలు పెంచుతున్నారు.

అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కనుంది ఈ మూవీ. ఈ సినిమా “ఎఫ్ 2″కి సీక్వెల్ గా రూపొందుతోంది.

More

Related Stories