వరుణ్ తేజ్ హెల్ప్ చేశారు: సాక్షి వైద్య


“ఏజెంట్” సినిమాతో తెలుగు సినిమాకి పరిచయం అయింది ముంబై ముద్దుగుమ్మ సాక్షి వైద్య. ఆమె రెండో చిత్రం… ‘గాండీవధారి అర్జున’. ఈ సినిమాలో వరుణ్ తేజ్ సరసన నటించింది. ఈ నెల 25న విడుదల కానున్న ఈ సినిమా గురించి ఈ భామ ముచ్చట్లు.

– “‘ఏజెంట్’ షూటింగ్ జరుగుతున్నప్పుడే ఈ సినిమా ఒప్పుకున్నా. ఈ సినిమాలో ఐరా అనే పాత్ర పోషించా. మంత్రి పక్కనే కనిపించే నా పాత్ర సినిమా కథకు కీలకం. పాటలు కోసం ఉండే హీరోయిన్ పాత్ర కాదు. డైరెక్టర్ ప్రవీణ్ గారు అద్భుతంగా పాత్రలను తీర్చిదిద్దారు. అంతకన్నా అద్భుతంగా తీశారు.”

– “ఈ సినిమాలో నా పాత్రకు నేనే డబ్బింగ్ చెప్పుకున్నాను. తెలుగు ఇప్పుడు అర్థం అవుతోంది. త్వరలోనే మాట్లాడే స్థాయిలో నేర్చుకుంటాను.”

– “వరుణ్ తేజ్ పెద్ద స్టార్ ఫ్యామిలీ నుంచి వచ్చినా ఆయన చాలా సింపుల్ గా ఉంటారు. ఈ షూటింగ్ టైంలో ఆయన ఎంతో హెల్ప్ చేశారు. ఇక నిర్మాతలు బాపినీడుగారు, బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ గారు ఎంతో బాగా చేసుకున్నారు. ఈ సినిమా నాకు చాలా మంచి అనుభూతిని మిగిల్చింది.”

– “ఏజెంట్ ఫ్లాప్ అవడం బాధ అనిపించింది. కానీ ఫలితం మా చేతిలో ఉండదు కదా… అందుకే అది మర్చిపోయి “గాండీవధారి”పై ఫోకస్ పెట్టాను.”

– “ఇప్పటికే పవన్ కళ్యాణ్ కొత్త చిత్రం “ఉస్తాద్ భగత్ సింగ్” సైన్ చేశాను. త్వరలోనే షూటింగ్ స్టార్ట్ అవుతుంది. దుల్కర్ సల్మాన్‌ హీరోగా తెలుగులో రూపొందే “లక్కీ భాస్కర్”, సాయిధరమ్ తేజ్ కొత్త మూవీలో కూడా చేయబోతున్నాను.”

Advertisement
 

More

Related Stories