దేవరకొండ టైటిల్ మెగా హీరోకి?

Vijay Deverakonda and Varun Tej

విజయ్ దేవరకొండ, పూరి జగన్నాధ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాకు “ఫైటర్” అనే టైటిల్ అనుకుంటున్నారు. అటు వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న సినిమాకు “బాక్సర్” అనే టైటిల్ అనుకుంటున్నారు. అయితే ఇప్పుడు వరుణ్ తేజ్ దృష్టి, ఫైటర్ అనే టైటిల్ పై పడింది. కుదిరితే తన సినిమాకు ఈ టైటిల్ పెట్టుకోవాలని వరుణ్ తేజ్ అనుకుంటున్నాడట.

విజయ్ దేవరకొండ సినిమాకు “ఫైటర్” అనేది వర్కింగ్ టైటిల్ మాత్రమేనని ఈమధ్య ఆ సినిమా నిర్మాత ఛార్మి ప్రకటించింది. త్వరలోనే టైటిల్ ప్రకటిస్తామని కూడా తెలిపింది. అయితే ఈ గ్యాప్ లోనే తమ సినిమాకు ఆ టైటిల్ పెట్టి పోస్టర్ వదిలితే ఎలా ఉంటుందని భావిస్తోంది వరుణ్ తేజ్ సినిమా యూనిట్.

మొన్నటికిమొన్న ప్రభాస్ సినిమా విషయంలో కూడా ఇదే జరిగింది. “జాన్” అనే వర్కింగ్ టైటిల్ తో సినిమా షూటింగ్ చేశారు. కానీ అదే టైటిల్ ను శర్వానంద్-సమంత హీరోహీరోయిన్లుగా నటించిన సినిమాకు పెట్టేశాడు దిల్ రాజు. దీంతో ప్రభాస్ ఇప్పటి వరకు మరో టైటిల్ ఫిక్స్ చేయలేకపోయాడు.

సరిగ్గా ఇలాంటి పరిస్థితే విజయ్ దేవరకొండ సినిమాకు కూడా రావొచ్చని కొంతమంది అంటున్నారు. అయితే వరుణ్ తేజ్ యూనిట్ మాత్రం పూరి జగన్నాధ్ ను సంప్రదించిన తర్వాతే టైటిల్ ఫిక్స్ చేయాలని అనుకుంటోంది.

Related Stories