నాకు నెగెటివ్ వచ్చిందోచ్!

- Advertisement -
Varun Tej

వరుణ్ తేజ్ ఆనందం మామూలుగా లేదు. స్కూల్ ఫస్ట్ వచ్చినంత ఆనందంగా “నాకు నెగెటివ్ వచ్చిందోచ్” అంటూ ప్రకటించాడు. అవును మరి, కోవిడ్19 రిపోర్ట్ లో వరుణ్ నెగెటివ్ తెచ్చుకున్నాడు. అంటే కరోనా వైరస్ ని జయించాడు. అందుకే ఇంత ఆనందం.

గత నెల్లో మెగా కుటుంబంలో జరిగిన ఒక సెలెబ్రేషన్ కి హాజరైన వరుణ్ తేజ్ కి, రామ్ చరణ్ కి, ఇతర కుటుంబ సభ్యులకు కరోనా వైరస్ సోకింది. వెంటనే రామ్ చరణ్, వరుణ్ తేజ్ షూటింగ్ లు బంద్ చేసి ఐసోలేషన్ కి వెళ్లారు. ఇంట్లోనే ఉండి చికిత్స చేయించుకున్నారు. లేటెస్ట్ రిపోర్ట్ లో వరుణ్ కి నెగెటివ్ వచ్చింది.

వరుణ్ తేజ్ ప్రస్తుతం రెండు సినిమాల్లో నటిస్తున్నాడు. ఈ రెండు సినిమాల షూటింగ్ ల్లో సంక్రాంతి తర్వాత పాల్గొంటాడు.

 

More

Related Stories