షూటింగ్ బంద్… జిమ్ములో బిజీ

Varun Tej

షూటింగులన్నీ రద్దు అయ్యాయి. దాంతో హీరోలు ఎలా టైం పాస్ చెయ్యాలో తెలియక సతమతమవుతున్నారు. లక్కీగా, గతేడాదిలా ఇప్పుడు జిమ్ములు బంద్ కాలేదు. దాంతో ప్రతిరోజూ జిమ్ కి వెళ్లి ఎక్సర్సైజులు చేస్తూ తమ ఫిట్నెస్ ని కాపాడుకుంటున్నారు. ఎక్కువ టైం అక్కడే స్పెండ్ చేస్తున్నారు.

హీరో వరుణ్ తేజ్ దాదాపుగా ప్రతిరోజూ కావూరి హిల్స్ లోని లైఫ్ స్టూడియో జిమ్ వద్ద కనిపిస్తున్నాడు. అంత డేడికేటెడ్ గా వర్కవుట్స్ చేస్తున్నాడు.

వరుణ్ తేజ్ ‘గని’, ‘ఎఫ్ 3’ సినిమాల్లో నటిస్తున్నాడు. ఈ రెండు సినిమాల షూటింగులు నిలిచిపోయాయి. విడుదల తేదీలు కూడా మారనున్నాయి. జులై 30న ‘గని’, ఆగస్టు 27న ‘ఎఫ్ 3’ విడుదల చేద్దామనుకున్నాడు. కానీ ఇప్పుడు కొత్త డేట్స్ వెతుక్కోవాలి.

More

Related Stories