
వరుణ్ తేజ్ కి నటుడిగా వైవిధ్యమైన సినిమాలు చెయ్యాలనేది కోరిక. “కంచె” సినిమా నుంచే వరుణ్ “డిఫరెంట్” సినిమాలు చేస్తూ వస్తున్నాడు. ఐతే, ఇటీవల వరుణ్ తేజ్ చేస్తున్న ప్రయోగాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతున్నాయి.
ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగించాలనే ఉద్దేశంతో “అంతరిక్షం” అనే స్పేస్ మూవీ చేశాడు. తాజాగా “ఆపరేషన్ వాలెంటైన్” పేరుతో తెలుగు తెరకు “ఏరియల్ యాక్షన్” థ్రిల్లర్ ని పరిచయం చేశాడు. ఇవన్నీ తెలుగు వాళ్లకు కొత్త జాన్రా అనే చెప్పాలి. కానీ ప్రేక్షకులు మాత్రం అతని ప్రయత్నాలకు విలువ ఇవ్వలేదు. ఆ రెండింటిని ఫ్లాప్ చేశారు.
ముఖ్యంగా వరుణ్ తేజ్ ఇటీవల నటించిన మూడు చిత్రాలు నిరాశపర్చాయి. “గాండీవధారి అర్జున”, “ఆపరేషన్ వాలెంటైన్” పరాజయం పాలు అయ్యాయి. ఇక “ఎఫ్ 3” విజయం సాధించినా పెద్దగా వరుణ్ కి హెల్ప్ కాలేదు.
ఇప్పుడు “మట్కా” పేరుతో మరో వెరైటీ మూవీ చేస్తున్నాడు. మరి ఈ ప్రయోగం అయినా మంచి ఫలితాన్ని ఇస్తుందా?