వరుణ్ తేజ్ దృష్టి మారింది!

- Advertisement -

అవును … వరుణ్ తేజ్ ఫోకస్ మారింది. ఎందుకంటే ఆయనకి విషయం అర్థం అయింది. విషయం లేకుండా సినిమాలు యాక్షన్ చేస్తే తన సినిమాలు చూడరని తెలుసుకున్నాడు. రెండేళ్ళకిపైగా పెట్టిన కష్టం, సమయం వృధా. ‘గని’ వల్లే ఇదంతా.

‘గని’ పరాజయం తర్వాత ఇకపై చేసే సినిమాలు, ఎన్నుకునే కథల విషయంలో కాస్త డీప్ గా థింకాలి అని డిసైడ్ అయ్యాట్ట. ఇటీవలే ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఒక మూవీ ఒప్పుకున్నాడు. అది యాక్షన్ చిత్రమే. కాకపోతే, సత్తారు విషయమున్న దర్శకుడు. ‘గరుడవేగ’ వంటి హిట్స్ ఇచ్చారు. అందుకే, ఆ సినిమా విషయంలో అతనికి భయం లేదు. ఆ తర్వాత ఎవరితో టీమప్ అవ్వాలి అనేది సమస్య.

ఇకపై కొత్త దర్శకులు తెచ్చే కథల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి అని అనుకుంటున్నాడట.

ఐతే, ఈ మార్పులు అన్ని ‘ఎఫ్ 3’ సినిమా విడుదల తర్వాతే. వచ్చే నెలలోనే ‘ఎఫ్ 3’ విడుదల కానుంది. ‘ఎఫ్ 2’కి ఇది సీక్వెల్. సో.. దానిపై భారీ అంచనాలు ఉన్నాయి.

 

More

Related Stories