90% తెచ్చుకుంటే కలుస్తా: వీడీ

- Advertisement -
Vijay Deverakonda

యువతలో బాగా పాపులారిటీ ఉన్న హీరో… విజయ్ దేవరకొండ. ఇటీవల విజయ్ దేవరకొండ సినిమాలు పెద్దగా ఆడలేదు. అయినా, అతని క్రేజ్ యూత్ లో తగ్గలేదు. ముఖ్యంగా అమ్మాయిల్లో అతనికి ఉన్న క్రేజ్ వేరు.

తాజాగా ఇద్దరు స్టూడెంట్స్ మేము చదువుకొని మంచిగా పరీక్షలు రాయాలంటే విజయ్ మాకు కామెంట్ చెయ్యాలంటూ ఇన్ స్టాగ్రామ్ లో ఒక వీడియో పెట్టారు. దానికి విజయ్ దేవరకొండ స్పందించడం విశేషం.

“విజయ్ దేవరకొండ ఈ వీడియోకి కామెంట్ చేస్తే మేము మా పరీక్షలకు ప్రిపేర్ అవుతాం. ఒకవేళ మేం ఫెయిల్ అయితే చెప్పుకునేందుకు వంక కూడా దొరికింది,”అంటూ హర్షిత రెడ్డి అనే అమ్మాయి ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఈ వీడియో పోస్ట్ బాగా వైరల్ అయింది. అది విజయ్ దేవరకొండ వద్దకు చేరింది. దాంతో ఈ వీడియోకు విజయ్ దేవరకొండ రిప్లై ఇచ్చా రు.

“90 శాతం మార్కు లు తెచ్చుకొండి… నేను మిమ్మల్ని కలుస్తా” అంటూ వారికీ సమాధానం ఇచ్చి వారు చదువుకునేలా ఎంకరేజ్ చేశారు వీడీ. ఈ హీరో కొత్త సినిమా “ఫ్యామిలీ స్టార్” ఈ ఏప్రిల్ 5న విడుదల కానుంది.

 

More

Related Stories