‘వేదం’ నాగయ్య కన్నుమూత

‘వేదం’ సినిమాలో రాములు పాత్రతో పేరు తెచ్చుకున్న నాగయ్య ఇక లేరు. చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. శనివారం తన నివాసంలోనే కన్నుమూశారు. గుంటూరు జిల్లా దేచవరం ఆయన ఊరు. ‘వేదం’ తర్వాత ఆయన అనేక సినిమాల్లో తాతగా, ముసలివ్యక్తిగా నటించారు.

నాగయ్య ఆర్థిక పరిస్థితి బాగోలేదని తెలుసుకున్న తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్‌ ఆయనకు ఆర్థికసాయం అందించారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కూడా సాయం అందించింది.

More

Related Stories