ఇద్దరూ ‘వీర’త్వం చూపుతారు!


మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న కొత్త చిత్రానికి పేరు ఇంకా పేరు ప్రకటించలేదు కానీ ఈ సినిమా టైటిల్ ఏంటో ఇప్పటికే అందరికీ తెలుసు. ఇక నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని తీస్తున్న సినిమా పేరుని ఈనెల 21న కర్నూలులో ప్రకటిస్తారు. ఈ రెండు సినిమాలకు ఒక కామన్ ఫ్యాక్టర్ ఉంది.

చిరంజీవి – దర్శకుడు బాబీ కాంబినేషన్ లో రూపొందుతోన్న సినిమాకి ‘వాల్తేర్ వీరయ్య’ అనే టైటిల్ అనుకుంటున్నారు. ఎందుకంటే, ఈ సినిమాలో చిరంజీవి పేరు వీరయ్య. మెగాస్టార్ జీవితంలో వీరేయ్య అనే ఒక వ్యక్తి కీలక పాత్ర పోషించారు. ఆయనకి నివాళిగా చిరంజీవి ఈ సినిమాలో తన పాత్రకి వీరయ్య అని పేరు పెట్టుకున్నారు. అదే టైటిల్ కానుంది.

ఇక బాలయ్య తాను నటిస్తున్న సినిమాలో ద్విపాత్రాభినయం చేస్తున్నారు. అందులో మెయిన్ రోల్ పేరు వీరసింహా రెడ్డి. అదే ఈ సినిమాకి టైటిల్ కానుంది.

ఇలా చిరంజీవి, బాలయ్య సినిమాల పాత్రల్లో, సినిమా టైటిల్స్ లో ‘వీర’ అనేది కామన్. బాక్సాఫీస్ వద్ద వీరిద్దరూ తమ ‘వీర’త్వం చూపనున్నారు.

 

More

Related Stories