వేగేశ్న సతీష్ కథల వెబ్ సిరీస్

- Advertisement -

‘శతమానం భవతి’ వంటి బ్లాక్ బస్టర్ మూవీ తీసిన దర్శకుడు సతీష్ వేగేశ్న డిజిటల్ రంగంలోకి అడుగుపెడుతున్నారు. ఆయన కూడా OTT వేదిక కోసం కంటెంట్ అందిస్తున్నారు. ‘కథలు(మీవి మావి)’ అనే పేరుతో ఒక వెబ్ సిరీస్ రూపొందిస్తున్నారు.

పల్లెటూరి కథలతో రూపొందే ఈ వెబ్ సిరీస్ షూటింగ్ మొదలైంది. ఇప్పటికే మూడు కథల చిత్రీకరణ పూర్తి చేశారట. ఒక ప్రముఖ OTT సంస్థ ద్వారా విడుదల చేయనున్నారు.

OTT వేదికపై థ్రిల్లర్లు, క్రైం, సెక్స్ లతో కంటెంట్ నిండిపోయింది. అందుకే, ఫ్యామిలీ ఎమోషన్స్ తో ఫ్రెష్ కంటెంట్ అందించనున్నారు.

ప్రస్తుతం ‘కోతి కొమ్మచ్చి’, ‘శ్రీ శ్రీ రాజా వారు’ సినిమాలు చేస్తున్నారు వేగేశ్న సతీష్.

 

More

Related Stories